Share News

బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు 130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:07 AM

దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు బుధవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతోపాటు అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువ...

బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు 130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు బుధవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతోపాటు అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువగా ఉండటంతో ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య విధానం విషయంలో రానున్న నెలల్లో అంత దూకుడుగా వ్యవహరించకపోవచ్చన్న అంచనాలు మన మార్కెట్ల రికవరీకి దోహదపడ్డాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 130.49 పాయింట్లు పెరిగి 77,185.43 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 591.33 పాయింట్ల లాభంతో 77,646.27 స్థాయికి ఎగబాకింది. ఇక ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 26.45 పాయింట్ల లాభంతో 24,078.50 పాయింట్ల వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ షేర్లలోని ఎటర్నల్‌, అల్ర్టాటెక్‌ సిమెంట్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు అధిక లాభాలను నమోదు చేసిన వాటిలో ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌ వంటివి నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

ఐపీవోకు ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్ఛేంజ్‌

దేశంలో తొలి నేచురల్‌ గ్యాస్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఐజీఎక్స్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు సిద్ధమైంది. ఐపీవో ప్రాథమిక పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) రూపంలో ఉంటుంది. ఇందులో భాగంగా ప్రమోటర్‌ అయిన ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఐఈఎక్స్‌) 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్టు ముసాయిదా రెడ్‌హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:07 AM