ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:07 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో ఐదు రోజుల రిలీఫ్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 607.08 పాయింట్ల నష్టంతో 76,802.90 దగ్గర ముగియగా నిఫ్టీ...
సెన్సెక్స్ 607 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఐదు రోజుల రిలీఫ్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 607.08 పాయింట్ల నష్టంతో 76,802.90 దగ్గర ముగియగా నిఫ్టీ 154.90 పాయింట్ల నష్టంతో 24,013.10 దగ్గర క్లోజైంది. శాంతి ఒప్పందం కోసం అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన భేటీ వాయిదా పడటం, లాభాల స్వీకరణ అమ్మకాలు, కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు వారాంతంలో సూచీలను కిందికి లాగాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 940.26 పాయింట్ల వరకు నష్టపోయి 76,469.72 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అయితే గత ఐదు రోజుల రిలీఫ్ ర్యాలీని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 3,577.43 పాయింట్లు (4.84 శాతం), నిఫ్టీ 50 సూచీ 1,006.4 పాయింట్లు పెరిగాయి.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News