Share News

సెన్సెక్స్‌ 353 పాయింట్లు డౌన్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:19 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు ముడిచమురు ధరల...

సెన్సెక్స్‌ 353 పాయింట్లు డౌన్‌

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష నేపథ్యంలో మదుపరుల అప్రమత్త ధోరణి ఇందుకు కారణమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 995.1 పాయింట్లు పతనమై 72,603.57 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత సూచీ క్రమంగా కోలుకుని చివరికి 352.64 పాయింట్ల నష్టంతో 73,246.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50.90 పాయింట్లు కోల్పోయి 22,698.85 వద్ద ముగిసింది. జియో షేర్ల లిస్టింగ్‌తో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మాత్రం రూ.12.87 లక్షల కోట్లు పెరిగి రూ.472.63 లక్షల కోట్లకు (4.96 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసల నష్టంతో రూ.95.28 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:20 AM