ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:10 AM
కంపెనీల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరింత సులభతరం చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎస్‌ఈ)ల ద్వారా...
స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా 66 రోజుల్లో పూర్తి చేయాలి
ఆగస్టు 1 నుంచే అమల్లోకి కొత్త నిబంధనలు: సెబీ
ముంబై: కంపెనీల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరింత సులభతరం చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎస్‌ఈ)ల ద్వారా జరిగే ఓపెన్ మార్కెట్ షేర్ల బైబ్యాక్ విధానాన్ని తిరిగి అనుమతించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. శుక్రవారం చైర్మన్ తుహిన్ కాంత పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెబీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పద్దతిలో ప్రారంభమైన షేర్ల బైబ్యాక్‌ను కంపెనీలు 66 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేటాయించిన నిధుల్లో 40 శాతాన్ని కంపెనీలు తొలి 33 రోజుల్లోనే ఖర్చు చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా 66 రోజుల్లో జరిగే ఈ షేర్ల బైబ్యాక్ ప్రక్రియలో ప్రమోటర్లు, వారి అనుచరులు ఎవరూ పాల్గొనకూడదని కూడా సెబీ స్పష్టం చేసింది. షేర్ల బైబ్యాక్‌పై వచ్చే లాభాలపై వాటాదారులే పన్ను చెల్లించే విధానం వచ్చినందున మళ్లీ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లను అనుమతించాలని నిర్ణయించినట్టు పాండే చెప్పారు. ప్రస్తుత బుక్ బిల్డింగ్ విధానానికి తోడుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News