Share News

ఎన్‌ఎస్ఈ నుంచి బాహుబలి ఐపీఓ

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:39 AM

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను...

ఎన్‌ఎస్ఈ నుంచి బాహుబలి ఐపీఓ

నేడు లేదా రేపు సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ

ఇష్యూ పరిమాణం రూ.25,000 కోట్లు!

న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను ఎన్‌ఎస్‌ఈ అధికారులు సోమవారం లేదా మంగళవారం క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి సమర్పించనున్నారు. ఈ ఐపీఓకి.. ఎన్‌ఎస్ఈ డైరెక్టర్ల బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. దీంతో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్లు సమీకరించాలని ఎన్‌ఎ్‌సఈ భావిస్తున్నట్టు సమాచారం. భారత ఐపీఓ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద బాహుబలి ఐపీఓ అవుతుందని భావిస్తున్నారు.

పదేళ్ల కల: దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీ అయిన ఎన్‌ఎస్ఈ ఎప్పటి నుంచే ఐపీఓకు రావాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 2016లోనే ప్రయత్నించింది. అయితే రెగ్యులేటరీ అంశాలు, కో-లొకేషన్‌ వంటి కేసుల కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఆ విషయాలు పరిష్కారం కావటంతో ఈ ఏడాది జనవరిలో సెబీ.. ఎన్‌ఎస్ఈ పబ్లిక్‌ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా డీఆర్‌హెచ్‌పీ సమర్పించి మదుపరుల నుంచి నిధుల సమీకరణ చేయాలని ఎన్‌ఎస్ఈ నిర్ణయించింది. మరోవైపు ఈ బాహుబలి ఐపీఓ కోసం మార్కెట్‌ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఇవీ చదవండి:

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

Updated Date - Jun 15 , 2026 | 05:39 AM