ఎన్‌ఎస్‌ఈ రూ.5 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:53 AM
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేరు సోమ వారం 4.02 శాతం వృద్ధితో రూ.2,070.05 వద్దకు చేరింది. ఈ షేరు...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేరు సోమ వారం 4.02 శాతం వృద్ధితో రూ.2,070.05 వద్దకు చేరింది. ఈ షేరు రూ.2,000 ఎగువన ముగియడం ఇదే తొలిసారి. దాంతో ఎన్‌ఎ్‌సఈ మార్కెట్ విలువ కూడా తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయికి చేరింది. రూ.5,12,338 కోట్ల వద్ద ముగిసింది. తద్వారా ఎక్స్ఛేంజ్.. మార్కెట్లో 10వ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. ఎన్‌ఎస్‌ఈ షేర్లు గత నాలుగు రోజుల్లో 7.35 శాతం వృద్ధి చెందాయి. ఐపీఓ ధర రూ.1,785తో పోలిస్తే, షేరు 16 శాతం ఎగబాకింది. ఈ ఎక్స్ఛేంజ్ షేర్లు సెప్టెంబరు 24న బీఎస్‌ఈలో లిస్టయ్యాయి.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!