రూ.25,000 కోట్లకు ఎన్‌ఎస్ఈ ఐపీఓ సైజు!
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:57 AM
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) తన తొలి పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) సైజును గత అంచనా రూ.30,000 కోట్ల నుంచి రూ.25,000-27,000 కోట్లకు..
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) తన తొలి పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) సైజును గత అంచనా రూ.30,000 కోట్ల నుంచి రూ.25,000-27,000 కోట్లకు తగ్గించుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఇన్వెస్టర్లలో కొందరు వాటా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. దాంతో, ఐపీఓలో ఎన్‌ఎ్‌సఈ వాటా విక్రయ సైజు 6 శాతం నుంచి 5.2-5.5 శాతానికి తగ్గనుంది. ఐపీఓలో విక్రయించే షేర్ల ధరల శ్రేణిని రూ.1,800పైస్థాయిలో నిర్ణయించవచ్చని గతంలో అంచనాలు వెలువడగా.. తాజాగా ఇది రూ.1,700-1,800 స్థాయికి తగ్గవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..