Share News

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు 6 రెట్ల స్పందన

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:02 AM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) రూ.22,569 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. సోమవారంతో ముగిసిన ఈ ఇష్యూ దాదాపు 6 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ను దక్కించుకుంది....

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు 6 రెట్ల స్పందన

రూ.90,300 కోట్ల విలువైన బిడ్ల దాఖలు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) రూ.22,569 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. సోమవారంతో ముగిసిన ఈ ఇష్యూ దాదాపు 6 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ను దక్కించుకుంది. బీఎ్‌సఈ వెబ్‌సైట్‌ డేటా ప్రకారం.. ఐపీఓలో భాగంగా ఎన్‌ఎ్‌సఈ ఆఫర్‌ చేసిన 8.86 కోట్లకు పైగా షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్లకు పైగా షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. అంటే ఇష్యూ సైజుకు 5.71 రెట్ల బిడ్లు వచ్చాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు కేటాయించిన షేర్లకు 12.68 రెట్ల బిడ్లు దాఖలు కాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 6.55 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 1.39 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. అంటే, ఈ ఇష్యూలో పెట్టుబడులు పెట్టేందుకు బిడ్‌ వేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లలో ప్రతి నలుగురిలో ముగ్గురికి ఎన్‌ఎస్ఈ షేర్లు లభించే అవకాశం ఉంది. కాగా, ఇష్యూ సైజు రూ.22,569 కోట్లతో పోలిస్తే, షేర్ల కొనుగోలుకు అన్ని ఇన్వెస్టర్ల విభాగాల నుంచి లభించిన మొత్తం డిమాండ్‌ దాదాపు రూ.90,300 కోట్ల స్థాయిలో ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 05:02 AM