Share News

టెక్‌ వ్యూ 23,600, 24,000 వద్ద నిరోధం

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:16 AM

నిఫ్టీ గత వారం ప్రారంభం నుంచే డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 300 పాయింట్ల మేర నష్టపోయింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 50 పాయింట్లు నష్టపోయి 23,346 వద్ద క్లోజైంది. మార్కెట్‌ వరుసగా...

టెక్‌ వ్యూ  23,600, 24,000 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం ప్రారంభం నుంచే డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 300 పాయింట్ల మేర నష్టపోయింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 50 పాయింట్లు నష్టపోయి 23,346 వద్ద క్లోజైంది. మార్కెట్‌ వరుసగా ఆరు వారాల నుంచి డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవలి గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 1,500 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే కొద్ది రోజులుగా కనిష్ఠ స్థాయిల నుంచి మైనర్‌ రికవరీని కనబరుస్తూ మానసిక అవధి స్థాయిలైన 23,000 వద్ద మద్దతు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ ఈ వారం కీలక, బలమైన పరీక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మే, జూన్‌ నెలలో ఏర్పడిన మేజర్‌ బాటమ్‌ స్థాయికి చేరువై అప్రమత్తతను సూచిస్తోంది. ఇక్కడ రికవరీ కనబరిచి కొద్ది రోజుల పాటు పటిష్ఠతను సూచిస్తేనే స్వల్పకాలానికి సానుకూల సంకేతాలు వెలువరించే అవకాశం ఉంది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ ఆ తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ అయ్యి 62,000 స్థాయికి స్వల్ప ఎగువన క్లోజైంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 1 శాతం మేర నష్టపోయి తర్వాత కోలుకుని ఎలాంటి మార్పులేకుండా 19,875 వద్ద స్థిరపడింది

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఈ వారం ఏదేనీ సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే 23,400, 23,600 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయి 24,000. గత కొద్ది వారాలుగా ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమవుతూ వస్తోంది. స్వల్పకాలానికి సానుకూలతను సూచించాలంటే ఇక్కడ నిలదొక్కుకోవాలి.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 23,200 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. తదుపరి మద్దతు స్థాయి 23,000. రక్షణ, సత్వర అప్‌ట్రెండ్‌ అవకాశాల కోసం ఈ స్థాయిల వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ మరింత బలహీనతను సూచిస్తూ 247 పాయింట్లు నష్టపోయి 56,350 వద్ద క్లోజైంది. సానుకూల ట్రెండ్‌ కోసం ఈ సూచీ నిరోధ స్థాయిలైన 57,000 ఎగువన నిలదొక్కుకోవాలి. ఒకవేళ మరింత బలహీనతను సూచిస్తే 56,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. రక్షణ కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. లేనిపక్షంలో స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.


పాటర్న్‌: ప్రస్తుతం మార్కెట్లో ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌ కారణంగా మైనర్‌ రికవరీ కనిపిస్తోంది. సానుకూలత కోసం ఈ వారం తప్పనిసరిగా అప్‌వర్డ్‌ రివర్సల్‌ ప్యాట్రన్‌ను సూచించాలి. నిఫ్టీ ప్రధాన నిరోధ స్థాయిలైన 24,000 వద్ద ‘అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌’ ఉంది. స్వల్పకాలానికి సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. అలాగే 23,000 దిగువన మద్దతు స్థాయిలున్నాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,400, 23,510

మద్దతు : 23,200, 23,120

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలు కూడా చదవండి

భారత జీడీపీ 7 శాతం: మూడీస్‌

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు

Updated Date - Sep 21 , 2026 | 05:16 AM