Share News

టెక్‌ వ్యూ 23,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:35 AM

నిఫ్టీ గత వారం ఆరంభంలో 625 పాయింట్ల బలమైన ర్యాలీని కనబరిచి వారాంతంలో 23,150 స్థాయిల్లో క్లోజైంది. వరుసగా తొమ్మిది వారాల డౌన్‌ట్రెండ్‌ అనంతరం నిఫ్టీ గత వారం పటిష్ఠమైన అప్‌ట్రెండ్‌ను...

టెక్‌ వ్యూ 23,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

నిఫ్టీ గత వారం ఆరంభంలో 625 పాయింట్ల బలమైన ర్యాలీని కనబరిచి వారాంతంలో 23,150 స్థాయిల్లో క్లోజైంది. వరుసగా తొమ్మిది వారాల డౌన్‌ట్రెండ్‌ అనంతరం నిఫ్టీ గత వారం పటిష్ఠమైన అప్‌ట్రెండ్‌ను కనబరిచింది. మార్కెట్‌ రీబౌండ్‌ కావటంతో కనిష్ఠ స్థాయిల వద్ద మద్దతును తీసుకోవటం ద్వారా ప్రమాదం నుంచి బయటపడింది. కనిష్ఠ స్థాయిల వద్ద ఎలాంటి కన్సాలిడేషన్‌ను కనబరచకుండా టెక్నికల్‌గా బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ప్రస్తుత మానసిక అవధి స్థాయులైన 23,000 వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. టెక్నికల్‌గా చూస్తే మార్కెట్‌ సానుకూల సంకేతాలు వెలువరిస్తోంది. గత వారం 23,000 వద్ద అప్‌సైడ్‌ బ్రేకౌట్‌ సాధించటంతో పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు అవకాశాలున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లలో రియాక్షన్‌ కారణంగా దేశీయంగా ఈ వారం అప్రమత్త ట్రెండ్‌తో ప్రారంభం కావచ్చు. కొద్ది రోజుల పాటు 23,000 వద్ద బలమైన సానుకూల కన్సాలిడేషన్‌ను కనబరిస్తేనే స్వల్పకాలిక సానుకూల సంకేతాలు వెలువరిస్తుంది. మరోవైపు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ స్వల్ప లాభాలతో 59,130 వద్ద, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నిలకడగా 19,130 వద్ద క్లోజైంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే తదుపరి నిరోధ స్థాయి 23,300 ఎగువన ఉంటుంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధా న నిరోధం 23,600, 24,000 (ఇది రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి).

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 23,000 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,600 దిగువన ఉంటుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 590 పాయింట్ల లాభంతో 55,850 వద్ద క్లోజైంది. ప్రస్తుతం ఈ సూచీ 56,400 వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటోంది. పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 57,000. ఒకవేళ ప్రస్తుత మద్దతు స్థాయిలైన 55,300 వద్ద ఏదేనీ బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 54,700, 54,000 వద్ద ఉంటాయి.

పాటర్న్‌: ప్రస్తుతం మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌ కారణంగా రికవరీపథంలో సాగుతోంది. ప్రస్తుతం నిఫ్టీ 23,000 స్థాయిల్లో 25 రోజుల చలన సగటు వద్ద ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,300, 23,390

మద్దతు : 23,000, 22,900

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 19 , 2026 | 04:35 AM