Share News

టెక్‌ వ్యూ 23,600 వద్ద నిరోధం

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:37 AM

నిఫ్టీ గత వారం ప్రారంభంలో అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ 23,500 స్థాయిలకు చేరుకుంది. అయితే గురువారం...

టెక్‌ వ్యూ 23,600 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం ప్రారంభంలో అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ 23,500 స్థాయిలకు చేరుకుంది. అయితే గురువారం బలమైన రియాక్షన్‌ను కనబరుస్తూ 400 పాయింట్ల మేర నష్టపోయింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 205 పాయింట్లు నష్టపోయి 23,140 వద్ద క్లోజైంది. నిఫ్టీ బలమైన రియాక్షన్‌ను కనబరిచినప్పటికీ ప్రధాన మద్దతు స్థాయిలైన 23,000 ఎగువనే ఉంది. మార్కెట్‌ గడిచిన ఏడు వారాలుగా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉంది. గడిచిన రెండు వారాలుగా 23,000 స్థాయిల నుంచి మైనర్‌ రికవరీ కనబరుస్తోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లలో బలమైన రికవరీని కనబరచటంతో ఈ వారం దేశీయ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గరిష్ఠ నిరోధ స్థాయిల వద్ద మరోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనవచ్చు. తదుపరి నిరోధ స్థాయిల వద్ద పటిష్ఠతను సూచిస్తేనే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను సూచిస్తుందా లేదా అనేది తేలుతుంది. కాగా గత వారం నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2 శాతం మేర పతనమై 69,900 వద్ద ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 0.8 శాతం నష్టపోయి 19,700 వద్ద క్లోజైంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఈ వారం ఏదేనీ సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే 23,300 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయి 23,600. గడిచిన రెండు వారాల్లో ఏర్పడిన స్వల్పకాలిక నిరోధ స్థాయి ఇది. సానుకూలతను సూచించాలంటే ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,000.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 23,000 దిగువన మద్దతు స్థాయిలు ఉంటా యి. జూన్‌లో ఇక్కడ బలమైన రికవరీ సాధించింది. రక్షణ, సత్వర అప్‌ట్రెండ్‌ అవకాశాల కోసం ఈ స్థాయిల వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ మరింత బలహీనతను సూచిస్తూ 780 పాయింట్లు నష్టపోయి 55,580 వద్ద క్లోజైంది. సానుకూల ట్రెండ్‌ కోసం ఈ సూచీ నిరోధ స్థాయిలైన 56,000 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. తదుపరి ప్రధాన నిరోధం 56,700, 57,000. ఒకవేళ మరింత బలహీనతను సూచిస్తే 55,500 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.


పాటర్న్‌: ప్రస్తుతం మార్కెట్‌ డబుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌, 23,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన ట్రెండ్‌లైన్‌కు స్వల్ప ఎగువన ఉంది. ఒకవేళ బ్రేక్‌డౌన్‌ అయితే మరింత బలహీనతను సూచిస్తుంది. ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌ కారణంగా మైనర్‌ రికవరీ కనిపిస్తోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు మాత్రం రివర్సల్‌ ప్యాట్రన్‌ను సూచిస్తోంది. తదుపరి 23,600 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌ వద్ద తదుపరి నిరోధ స్థాయిలు ఉంటాయి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,300, 23,380

మద్దతు : 23,120, 23,000

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 04:37 AM