టెక్ వ్యూ 23,000 వద్ద మద్దతు స్థాయిలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:13 AM
నిఫ్టీ గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌ను కనబరుస్తూ 500 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 23,400 స్థాయిల వద్ద క్లోజైంది. గడచిన ఐదు వారాలుగా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ...
నిఫ్టీ గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌ను కనబరుస్తూ 500 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 23,400 స్థాయిల వద్ద క్లోజైంది. గడచిన ఐదు వారాలుగా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ దాదాపు 1,400 పాయింట్లు నష్టపోయి మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం నిఫ్టీ 150 పాయింట్ల మేరకు రీబౌండ్ అయినప్పటికీ ఎలాంటి సానుకూల సంకేతాలు వెలువరించలేదు. సానుకూలత, పటిష్ఠత కోసం ఈ వారం నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అప్పుడే స్వల్పకాలిక దిశను సూచిస్తుంది. లేకపోతే ఈ వారం మార్కెట్లు మరింత డౌన్‌ట్రెండ్‌లోకి జారుకోవచ్చు. మరోవైపు మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా రియాక్షన్‌ను కనబరిచి చివరికి 1.4 శాతం మేర నష్టపోయి 62,000 స్థాయిలకు స్వల్ప ఎగువన క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ సాధించినప్పటికీ గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్తతను సూచిస్తోంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ ఈ వారం సైడ్‌వేస్ ధోరణిలో సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ధరల స్థాయిలు చాలా దూరంగా ఉండటం మార్కెట్లో అనిశ్చితిని సూచిస్తోంది. ఏదేనీ సానుకూలతను కనబరిస్తే 23,600 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 24,000.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 23,200 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. రక్షణ, సత్వర అప్‌ట్రెండ్ అవకాశాల కోసం ప్రధాన మద్దతు స్థాయిలైన 23,000 వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ కరెక్షన్ ట్రెండ్‌లో సాగుతూ వీక్లీ ప్రాతిపదికన 760 పాయింట్లు నష్టపోయి 56,000 దిగువకు చేరింది. అయితే శుక్రవారం బలమైన రీబౌండ్‌తో 1,000 పాయింట్లు పెరిగినప్పటికీ అనిశ్చిత ట్రెండ్‌ను కనబరుస్తూ వీక్లీ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యలో 56,600 వద్ద క్లోజైంది. సానుకూల ట్రెండ్ కోసం ఈ వారం నిరోధ స్థాయిలైన 57,000 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 57,400, 58,000. బలహీనతను సూచిస్తే 56,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.
పాటర్న్: ప్రస్తుతం ఆర్‌ఎ్‌సఐ.. ఓవర్‌సోల్డ్ పొజిషన్‌ను కొనసాగిస్తుండటంతో స్వల్పకాలిక అమ్మకందారులు అప్రమత్తంగా ఉండాలి. జూన్‌లో ఏర్పడిన బాటమ్ స్థాయిలైన 23,000కు స్వల్ప ఎగువన ఉంది. సానుకూలత కోసం ఇక్కడ రికవరీ కావాలి. నిఫ్టీ 24,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌కు చేరువలో ఉంది. స్వల్పకాలిక సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,540, 23,600
మద్దతు : 23,200, 23,120
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!