Share News

టెక్‌ వ్యూ 22,000 ఎగువన మద్దతు

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:55 AM

నిఫ్టీ ఎనిమిది వారాలుగా కొనసాగిస్తున్న డౌన్‌ట్రెండ్‌ను గత వారం కూడా కొనసాగించింది. నిఫ్టీ ఇంత సుదీర్ఘకాలం డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించటం 25 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గత వారం నిఫ్టీ ఆరంభంలో...

టెక్‌ వ్యూ 22,000 ఎగువన మద్దతు

నిఫ్టీ ఎనిమిది వారాలుగా కొనసాగిస్తున్న డౌన్‌ట్రెండ్‌ను గత వారం కూడా కొనసాగించింది. నిఫ్టీ ఇంత సుదీర్ఘకాలం డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించటం 25 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గత వారం నిఫ్టీ ఆరంభంలో 23,000 స్థాయిల్లో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఆ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 720 పాయింట్లు (3.1ు) నష్టపోయి 22,420 వద్ద క్లోజైంది. మంత్లీ ప్రాతిపదికన చూస్తే సెప్టెంబరులో నిఫ్టీ ఏకంగా 1,460 పాయింట్లు (6ు) క్షీణించింది. అయితే గత గురువారం 22,200 కనిష్ఠ స్థాయిల నుంచి 200 పాయింట్ల మేర రికవరీ కావటంతో కన్సాలిడేషన్‌కు అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గత శుక్రవారం అమెరికా మార్కెట్లు రికవరీ కనబరచటంతో దేశీయంగా స్వల్ప బౌన్స్‌ బ్యాక్‌కు అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఈ వారం కొద్ది రోజుల పాటు నిలదొక్కుకుంటే స్వల్పకాలానికి సానుకూల కన్సాలిడేషన్‌ సంకేతాలను వెలువరిస్తుంది. కాగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఐదు నెలల ర్యాలీ అనంతరం డౌన్‌ట్రెండ్‌ను కనబరుస్తూ వీక్లీ ప్రాతిపదికన 3.5 శాతం నష్టపోయి 58,730 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 3.4 శాతం క్షీణించి 19.250 వద్ద ముగిసింది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఈ వారం ఏదేనీ సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే 22,600 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయి 22,800. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన, స్వల్పకాల నిరోధ స్థాయి 23,000. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 22,200 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,000 దిగువన ఉంటుంది. ఇది స్వల్పకాలిక మద్దతు స్థాయి.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ మరింత డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 1,230 పాయింట్లు నష్టపోయి 54,540 వద్ద క్లోజైంది. గత వారం ఈ సూచీ మద్దతు స్థాయిలైన 54,000 దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. తదుపరి ప్రధాన నిరోధ 55,300. ఇక్కడ నిలదొక్కుకుంటే అనంతరం 56,000 ఎగువన ప్రధాన నిరోధం ఉంటుంది. ఒకవేళ ఏదేనీ బలహీనతను సూచిస్తే 54,000 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.

పాటర్న్‌: ప్రస్తుతం మార్కెట్‌ 22,000 వద్ద ట్రిపుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌కు స్వల్ప ఎగువన ఉంది. మంత్లీ చార్టుల ప్రకారం ఈ మూడు బాటమ్స్‌ 2024 మే, 2025 మార్చి, 2026 ఏప్రిల్‌లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి బలంగా రికవరీ అయ్యాయి. ప్రస్తుతం నిఫ్టీ 23,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌ వద్ద ఉంది. ఇక్కడ తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ఆర్‌ఎ్‌సఐ ప్రకారం మార్కెట్‌ స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌లో ఉంది. ప్రస్తుత స్థాయిల వద్ద స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22,600, 22,680

మద్దతు : 22,400, 22,330

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 04:55 AM