Share News

26,000 దిశగా నిఫ్టీ..!

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:22 AM

గత వారం అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో సాగినప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం వరుసగా నాలుగో వారమూ అదరగొట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల...

26,000 దిశగా నిఫ్టీ..!

గత వారం అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో సాగినప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం వరుసగా నాలుగో వారమూ అదరగొట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) రూ.32,647 కోట్ల కొనుగోళ్లు, బ్రెంట్‌ క్రూడ్‌ ధర 92 డాలర్లకు దిగిరావటంతో నిఫ్టీ 656 పాయింట్ల లాభంతో 25,800 వద్ద సెన్సెక్స్‌ 2,327 పాయింట్లు ఎగబాకి 83,919 పాయింట్ల వద్ద క్లోజైంది. సూచీలకు ఇది తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి మంగళవారం గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావటంతో సోమవారమే మంత్లీ ఎక్స్‌పైరీ ఉండటంతో మార్కెట్లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉండొచ్చు. నిఫ్టీ 26,000 నిరోధాన్ని దాటితే రికార్డు గరిష్ఠాల వైపు దూసుకుపోవచ్చు. క్రూడాయిల్‌ గమనం, క్యూ2 జీడీపీ అంచనాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే వీలుంది. బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో రంగాలు రాణించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్తంగా వ్యవహరిస్తూ నాణ్యమైన లార్జ్‌ క్యాప్‌ షేర్లలో బై ఆన్‌ డిప్స్‌ వ్యూహాన్ని అనుసరించటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌: ఈ కౌంటర్‌లో బుల్‌రన్‌ కొనసాగుతూనే ఉంది. అలుపన్నదే లేకుండా అప్‌ట్రెండ్‌లో పరుగెడుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌కు తిరుగులేదు. ఫలితాలు నిలకడగా ఉన్నాయి. జీవితకాల గరిష్ఠాన్ని చేరాక కొంత దిద్దుబాటుకు లోనైంది. గత శుక్రవారం రూ.541 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.530 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.400 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఏయూ బ్యాంక్‌: ఈ షేరు దీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ మీడియం, షార్ట్‌ టర్మ్‌లో ఎక్కువగా డ్రా డౌన్స్‌ నమోదవుతున్నాయి. తాజా గరిష్ఠం తర్వాత 26 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు మళ్లీ 16 శాతం పుంజుకుని 200 రోజుల మూవింగ్‌ యావరేజీని క్రాస్‌ చేశాయి. గత శుక్రవారం రూ.984 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.980 శ్రేణిలో ప్రవేశించి రూ.1,150 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.950 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


భారత్‌ ఫోర్జ్‌: గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఆగస్టు వరకు 150 శాతానికి పైగా రాబడిని ఇచ్చిన ఈ షేరు ఆ తర్వాత 27 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.1,750 వద్దకు చేరింది. గత శుక్రవారం రూ.1,750 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ,1,750 ఎగువన ఎంటరై రూ.2,100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,700 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హిందాల్కో: జీవితకాల గరిష్ఠం తర్వాత 25 శాతం దిద్దుబాటుకు లోనైన ఈ షేరు మళ్లీ 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్దకు చేరాయి. తాజా ఫలితాల తర్వాత మళ్లీ ఈ కౌంటర్‌పై ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.929 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.920 శ్రేణిలో ఎంటరై రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.900 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌: గత ఏడాది నవంబరు నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. 35 శాతం వరకు పతనమైంది. ప్రస్తుతం టర్న్‌ అరౌండ్‌ అవుతోంది. చివరి 20 సెషన్లలో 17 శాతం పెరిగింది. గత శుక్రవారం రూ.825 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.820 ఎగువ శ్రేణిలో ప్రవేశించి రూ.930 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.800 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 03:22 AM