Share News

టెక్‌ వ్యూ గరిష్ఠ స్థాయిల వద్ద పరీక్ష

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:55 AM

నిఫ్టీ గత వారం ఆరంభంలో ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 26,000ను తాకి వెంటనే రియాక్షన్‌ను కనబరిచింది. చివరకు నాలుగు వారాల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ 193 పాయింట్ల నష్టంతో క్లోజైంది....

టెక్‌ వ్యూ గరిష్ఠ స్థాయిల వద్ద పరీక్ష

నిఫ్టీ గత వారం ఆరంభంలో ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 26,000ను తాకి వెంటనే రియాక్షన్‌ను కనబరిచింది. చివరకు నాలుగు వారాల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ 193 పాయింట్ల నష్టంతో క్లోజైంది. మైనర్‌ కరెక్షన్‌ను చవిచూసినప్పటికి మార్కెట్‌ ఇంకా ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువనే ఉండటంతో ఎలాంటి సంకేతాలు వెలువరించటం లేదు. అంతర్జాతీయ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఈ వారం మార్కెట్‌ సానుకూల ట్రెండ్‌లో ప్రారంభమై మరోసారి గరిష్ఠ స్థాయిలైన 26,000 వద్ద పరీక్షను ఎదుర్కొనవచ్చు. టెక్నికల్‌గా చూస్తే కొద్ది రోజుల పాటు ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. మరోవైపు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 184 పాయింట్ల నష్టంతో క్లోజైంది. ఈ సూచీ గత మూడు వారాలుగా 62,000 స్థాయిల వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటోంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నిలకడగా 19,480 వద్ద ముగిసింది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే 25,900 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 26,000. ఇది గత వారం ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోయింది. సానుకూలత కోసం ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవాలి.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 25,500 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇది కొద్ది రోజుల క్రితం ఏర్పడిన స్థాయి. ఒకవేళ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ సానుకూలంగా ప్రారంభమై గరిష్ఠ స్థాయిలైన 65,000 వద్ద బలమైన రియాక్షన్‌ను చవిచూసింది. చివరకు 1,600 పాయింట్ల (2.4 శాతం) నష్టంతో 63,000 వద్ద క్లోజైంది. ఈ వారం సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే 64,000 ఎగువన మైనర్‌ నిరోధం ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 65,000. ఒకవేళ బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 62,500 దిగువన ఉంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 26,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌ వద్ద ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. 25,500 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన ట్రెండ్‌లైన్‌ వద్ద తదుపరి మద్దతు స్థాయిలు ఉన్నాయి. 26,000 వద్ద డబుల్‌ టాప్‌ ప్యాటర్న్‌ ఏర్పడింది. ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,900, 26,000

మద్దతు : 25,600, 25,510

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలూ చదవండి

బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం

మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత

Updated Date - Nov 30 , 2026 | 04:55 AM