Share News

అప్రమత్తత బెటర్‌..

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:18 AM

ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ నుంచి అప్‌ట్రెండ్‌ ధోరణిని కనబరిచే అవకాశం ఉంది. నిఫ్టీ 23,000 స్థాయిని కాపాడుకుంటే స్వల్పకాలికంగా మార్కెట్లో బుల్లిష్‌ మూమెంటమ్‌...

అప్రమత్తత బెటర్‌..

ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ నుంచి అప్‌ట్రెండ్‌ ధోరణిని కనబరిచే అవకాశం ఉంది. నిఫ్టీ 23,000 స్థాయిని కాపాడుకుంటే స్వల్పకాలికంగా మార్కెట్లో బుల్లిష్‌ మూమెంటమ్‌ బలపడుతుంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అమెరికా ఉద్యోగ గణాంకాలు, డాలర్‌ ఇండెక్స్‌ కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పతనం, యూఎస్‌ టెక్‌, ఏఐ కంపెనీల షేర్లు పతనం అవుతుండటం, పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరల్లో ఒడుదొడుకుల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండాలి.

స్టాక్‌ రికమండేషన్స్‌..

టీడీ పవర్‌ సిస్టమ్స్‌ : సుదీర్ఘకాలంగా ఈ కౌంటర్‌ బుల్‌రన్‌ కొనసాగిస్తోంది. 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకున్న ప్రతిసారీ పైకి వెళ్తోంది. త్వరలో త్రైమాసిక ఫలితాలు రానుండటం, నిఫ్టీతో పోలిస్తే జోరు ప్రదర్శించడం, మంచి ఫండమెంటల్స్‌ వంటివి సానుకూలతలు. గత శుక్రవారం రూ.713 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.840 టార్గెట్‌ ధరతో రూ.700పై స్థాయిలో పొజిషన్‌ తీసుకోవాలి. రూ.680 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.

బాదల్‌ కెమికల్స్‌: జూలై నుంచి సెప్టెంబరు వరకు 260 శాతం రిటర్న్‌ అందించిన ఈ షేర్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత దిద్దుబాటుకు లోనయ్యాయి. దాదాపు 35శాతం మేర పతనమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.164 వద్ద ముగిసిన షేర్లను ఇన్వెస్టర్లు రూ.210 టార్గెట్‌ ధరతో రూ.150 స్థాయిలో కొనుగోలు చేయాలి. రూ.140 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

గ్రాన్యూల్స్‌: ఏడాదిన్నరగా ఈ షేర్లు దుమ్మురేపుతూ బుల్‌రన్‌ కొనసాగిస్తున్నాయి. గరిష్ఠ స్థాయిల్లో మరోసారి పుల్‌బ్యాక్‌ జరిగింది. ఇప్పుడు మళ్లీ బ్రేకౌట్‌ దిశగా సాగుతున్నాయి. ఈపీఎస్‌, అమ్మకాల గణాంకాలు బాగున్నాయి. ఈ వారం త్రైమాసిక ఫలితాలు రానున్నాయి. గత శుక్రవారం రూ.839 వద్ద ముగిసిన ఈ షేర్లను ఇన్వెస్టర్లు రూ.920/960 టార్గెట్‌ ధరతో రూ.830పై స్థాయిలో తీసుకోవాలి. రూ.800 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.


రేమండ్‌ లిమిటెడ్‌: కొన్ని నెలలుగా ఈ షేర్లు అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు 300 శాతం రాబడినిచ్చాయి. అయితే జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 25 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. మళ్లీ పుంజుకొని పైకెళ్లే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,100 వద్ద ముగిసిన ఈ షేర్లను రూ.1,300 టార్గెట్‌ ధరతో రూ.1,080/1,050 స్థాయిలో కొనుగోలు చేయాలి. రూ.1,020 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

ప్రికాల్‌ లిమిటెడ్‌: లాంగ్‌టర్మ్‌ బుల్‌ ట్రెండ్‌ కొనసాగిస్తున్న ఈ షేర్లు మీడియం టర్మ్‌లో కన్సాలిడేట్‌ అవుతున్నాయి. సుదీర్ఘ బేస్‌ను నిర్మిస్తున్నాయి. ఈ వారం ఫలితాలు రానుండటం, హెల్తీ వాల్యూమ్‌ ఆకర్షణీయంగా మారాయి. గత శుక్రవారం రూ.644 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.750/800 టార్గెట్‌ ధరతో రూ.620/640 శ్రేణిలో ఇన్వెస్ట్‌ చేయాలి. రూ.600 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

Updated Date - Nov 02 , 2026 | 05:18 AM