23,000 వద్ద నిలదొక్కుకోవడమే కీలక పరీక్ష
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:13 AM
నిఫ్టీ గత వారం 22,400 స్థాయి నుంచి పుంజుకుని 23,000 స్థాయి వరకు వెళ్లింది. చివరకు 450 పాయింట్ల లాభంతో 23,053 వద్ద ముగిసింది. అక్టోబరు నెల మొత్తాన్ని...
నిఫ్టీ గత వారం 22,400 స్థాయి నుంచి పుంజుకుని 23,000 స్థాయి వరకు వెళ్లింది. చివరకు 450 పాయింట్ల లాభంతో 23,053 వద్ద ముగిసింది. అక్టోబరు నెల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా, నిఫ్టీ 50 సూచీ 430 పాయింట్ల లాభంతో ముగిసింది. గత కొద్ది రోజుల మైనర్ ర్యాలీతో నిఫ్టీ 50 ప్రస్తుతం 23,000 పాయింట్ల ఎగువకు చేరింది. గత కొన్ని వారాలుగా నిఫ్టీ 50 ఈ స్థాయి వద్దే ఆటుపోట్లను చవిచూస్తోంది. నిఫ్టీ 50 ప్రస్తుతం మళ్లీ ఈ 23,000 పాయింట్ల నిరోధ స్థాయిని పరీక్షించే స్థితిలో ఉంది. గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదైన కదలికలను బట్టి సోమవారం మన మార్కెట్లు అప్రమత్తంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తదుపరి దిశను సూచించే ముందు మార్కెట్ ఈ గరిష్ఠ స్థాయి వద్ద కన్సాలిడేషన్‌ను కనబరిచే అవకాశం ఉంది. మరోవైపు మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ గతవారం 57,300 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 18,460 వద్ద క్లోజైంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ 50 సూచీకి 23,000 వద్ద నిరోధం ఉంటుంది. సానుకూల సంకేతం కోసం ఈ స్థాయి వద్ద నిలదొక్కుకోవాలి. ఆ తర్వాత 23,200 వద్ద ప్రధాన నిరోధం ఉంటుంది. మరింత స్వల్పకాలిక సానుకూల సంకేతం కోసం మార్కెట్ ఈ స్థాయి వద్ద నిలదొక్కుకోవాలి. తర్వాత తదుపరి నిరోధ స్థాయిలు 23,600, 24,000.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ 50 సూచీలో ఏదైనా బలహీనత కనిపిస్తే తదుపరి మద్దతు 22,800 వద్ద ఉంటుంది. ఈ స్థాయి వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే అది మైనర్ కరెక్షన్‌ను సూచిస్తుంది. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. దిగువన తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,500 వద్ద ఉంటుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 400 పాయింట్ల రికవరీతో 54,700 వద్ద ముగిసింది. గతమూడు నెలలుగా కరెక్షన్ ట్రెండ్‌లో ఉంది. ప్రస్తుతం ఇది 54,000 ప్రధాన మద్దతు స్థాయిల ఎగువన కన్సాలిడేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇది సానుకూల ధోరణిని ప్రదర్శిస్తే 55,200 వద్ద ప్రధాన నిరోధం ఉంటుంది. ఎగువన తదుపరి ప్రధాన నిరోధం 56,000. ఏదైనా బలహీనతను సూచిస్తే దిగువన ప్రధాన మద్దతు స్థాయి 54,000 వద్ద ఉంది. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమైతే మరింత బలహీనతను సూచిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి.
పాటర్న్: నిప్టీ 50 సూచీ 23,200 వద్ద డబుల్ టాప్ పాటర్న్‌ను ఏర్పరచింది. స్వల్పకాలిక సానుకూల ట్రెండ్ కోసం ఇక్కడ బ్రేకౌట్ అవ్వాలి. 23,200 వద్ద మార్కెట్‌కు సమాంతర వాలు గల రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్ ఉంది. సానుకూల సంకేతం కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి స్వల్పకాలిక 50 రోజుల మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్ దాదాపు 23,000 స్థాయిలో ఉంది. సానుకూల సంకేతం కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: మూడో ట్రేడింగ్ రోజు (బుధవారం) రివర్సల్ ఉండవచ్చని టైమ్ సూచిస్తోంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,090, 23,200
మద్దతు : 22,800, 22,710
వి. సుందర్ రాజా
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..