Share News

లాభాల్లోకి మార్కెట్లు

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:40 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కొద్దిగా కోలుకున్నాయి. ప్రధాన రేటింగ్‌ సంస్థలన్నీ భారత జీడీపీ వృద్ధి రేటు...

లాభాల్లోకి మార్కెట్లు

సెన్సెక్స్‌ 299 పాయింట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కొద్దిగా కోలుకున్నాయి. ప్రధాన రేటింగ్‌ సంస్థలన్నీ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను పెంచడం, బ్యారల్‌ ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు రావడం మార్కెట్లలో సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 444.66 పాయింట్ల వరకు దూసుకు పోయింది. చివరికి సెన్సెక్స్‌ 299.17 పాయింట్ల లాభంతో 74,828.25 దగ్గర క్లోజైంది. అలాగే నిఫ్టీ 117.80 పాయింట్ల లాభంతో 24,446.80 వద్ద ముగిశాయి.

జెట్‌వర్క్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ బిజినెస్‌ లిమిటెడ్‌ నుంచి రూ.177.35 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు అవాంటెల్‌ వెల్లడించింది. ఆర్డర్‌లో భాగంగా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది.

కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో డిజిటల్‌ ట్విన్‌ సాంకేతికతపై పరిశోధనలను మరింత వేగవంతం చేసేందుకు ఐఐఐటీ హైదరాబాద్‌, హెక్సాగాన్‌ ఆర్‌ అండ్‌ డీ ఇండియా వ్యూహాత్మక భాగస్వామాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఐఐఐటీ హైదరాబాద్‌ క్యాంప్‌సలో హెక్సాగాన్‌ డిజిటల్‌ ట్విన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:15 AM