చమురు తగ్గె.. సూచీలు ఎగబాకె
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:05 AM
చమురు ధరల తగ్గుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం లాభాల్లో...
సెన్సెక్స్ 564 పాయింట్లు అప్
ముంబై: చమురు ధరల తగ్గుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్లు ఎగబాకి వారానికి పైగా గరిష్ఠ స్థాయి 74,858.99 వద్దకు చేరుకుంది. నిఫ్టీ మరో 67.90 పాయింట్ల వృద్ధితో 23,414.30 వద్ద ముగిసింది. నిఫ్టీ లాభపడటం వరుసగా ఇది నాలుగో రోజు. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.8 లక్షల కోట్లు పెరిగి రూ.481.58 లక్షల కోట్లకు (5.03 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి రూ.95.78 వద్ద ముగిసింది. చమురు ధరల తగ్గుదల ఇందుకు ప్రధానంగా దోహదపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో 2.36 శాతం తగ్గి 101.4 డాలర్లకు దిగివచ్చింది. యుద్ధం ముగింపు కోసం అమెరికా- ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు మళ్లీ ప్రారంభం కావచ్చన్న అంచనాలు ఇందుకు కారణం.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..