Share News

పాంచ్‌ పటాకా!

ABN , Publish Date - Nov 05 , 2026 | 02:59 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 4,055.37 పాయింట్లు పుంజుకోగా....

పాంచ్‌ పటాకా!

  • వరుసగా ఐదో రోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

  • 5 సెషన్లలో సెన్సెక్స్‌ 4,055 పాయింట్లు అప్‌

  • రూ. 20.8 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్‌ సంపద

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 4,055.37 పాయింట్లు పుంజుకోగా.. నిఫ్టీ 1,261.75 పాయింట్లు బలపడింది. స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద ఏకంగా రూ.20.81 లక్షల కోట్లు పెరిగింది. కాగా, బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383.55 పాయింట్లు ఎగిసి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయి 77,301.40 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 149.75 పాయింట్ల వృద్ధితో 23,960.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 రాణించగా.. బీఈఎల్‌ 4.56 శాతం, టైటాన్‌ 4.28 శాతం ఎగబాకాయి. బీఎస్‌ఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 2.40 శాతం వృద్ధి చెందగా.. మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 0.81 శాతం లాభపడింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.6.65 లక్షల కోట్లు పెరిగి రూ.493.44 లక్షల కోట్లకు (5.2 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) కొత్త పెట్టుబడులు, ముడిచమురు ధరల తగ్గుదల ఇందుకు దోహదపడ్డాయి. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.7,284.03 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) మాత్రం రూ.3,712.23 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

రూపాయికి ఊరట: భారత కరెన్సీ విలువ మరింత పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు పెరిగి రూ.94.46 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటంతోపాటు చమురు ధరల తగ్గుదల ఇందుకు తోడ్పడింది. కాగా, ఇంటర్నేషనల్‌ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర ఒకదశలో 1.66 శాతం తగ్గి 101.87 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 05 , 2026 | 02:59 AM