Share News

ఈ వారం మిశ్రమంగానే..!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:40 AM

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను ట్రంప్‌ రద్దు చేయటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తిరిగి కొనుగోళ్లు...

ఈ వారం మిశ్రమంగానే..!

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను ట్రంప్‌ రద్దు చేయటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తిరిగి కొనుగోళ్లు చేపట్టడం సానుకూల అంశాలు. అయితే పశ్చిమాసియా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండ టం, కరెన్సీ బలహీనత, క్రూడాయిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగాలు రాణించవచ్చు. మైనింగ్‌, పీఎ్‌సయూ షేర్ల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం.

స్టాక్‌ రికమండేషన్స్‌

పరాస్‌ డిఫెన్స్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 144 శాతం రాబడిని అందించిన ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో చలిస్తోంది. అయితే కాస్త పుల్‌బ్యాక్‌కు లోనైంది. స్వల్పకాల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకున్నాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ కూడా బాగుంది. వాల్యూమ్‌ గణనీయంగా పెరిగింది. డార్విన్‌ బాక్స్‌ ఏర్పడింది. గత శుక్రవారం రూ.1,298 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,550 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,220 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నేషనల్‌ అల్యూమినియం కంపెనీ: గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 225 శాతం రాబడిని అందించిన ఈ షేరు జీవితకాల గరిష్ఠం తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. ఆరోగ్యకరమైన రీతిలో 31 శాతం మేర దిద్దుబాటు నమోదైంది. ప్రస్తుతం 200 రోజుల మూవింగ్‌ యావరేజీ కింద చలిస్తోంది. అయితే రూ.310 స్థాయిలో మరోసారి మద్దతు తీసుకునే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.324 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.320 శ్రేణిలో ఎంటరై రూ.375/400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.310 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మ్యాక్‌పవర్‌ సీఎన్‌సీ: జూన్‌ నుంచి ఇప్పటి వరకు 112 శాతం రాబడినిచ్చిన ఈ షేరు ప్రస్తుతం పుల్‌బ్యాక్‌కు లోనైంది. అయితే ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌ దొరకటంతో మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. పైగా త్రైమాసిక ఫలితాలు, రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.1,925 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1900 శ్రేణిలో ప్రవేశించి రూ.2,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,860 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


స్పోర్ట్స్‌ కింగ్‌: ఈ కౌంటర్‌ సుదీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఆగస్టు వరకు ఏకంగా 200 శాతం పెరిగింది. జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత ఆరోగ్యకర రీతిలో 18 శాతం మేర పుల్‌బ్యాక్‌ అయ్యింది. మళ్లీ గరిష్ఠ స్థాయిలకు చేరేందుకు ప్రయత్నిస్తోంది. గత శుక్రవారం రూ.222 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.210 పై స్థాయిలో ప్రవేశించి రూ.260/280 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.190 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

గ్రాన్యూల్స్‌: ఏడాదిన్నర కాలంగా ఈ షేరు దుమ్మురేపుతోంది. బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. గరిష్ఠ స్థాయిల్లో మరోసారి పుల్‌బ్యాక్‌ జరిగింది. ఇప్పుడు మళ్లీ బ్రేకౌట్‌ దిశగా సాగుతోంది. ఈపీఎస్‌, సేల్స్‌ గణాంకాలు బాగున్నాయి. గత శుక్రవారం రూ.825 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.800 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.925 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.780 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌ గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 19 , 2026 | 04:40 AM