కన్సాలిడేషన్ దశలోకి..!
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:12 AM
వరుసగా మూడు వారాల ర్యాలీ తర్వాత దలాల్ స్ట్రీట్ ఇప్పుడు కీలక మలుపు వద్దకు చేరింది. ఎఫ్‌ఐఐల జోరుతో గత వారం నిఫ్టీ 25,144 వద్ద లాభాలతో ముగిసినప్పటికీ...
వరుసగా మూడు వారాల ర్యాలీ తర్వాత దలాల్ స్ట్రీట్ ఇప్పుడు కీలక మలుపు వద్దకు చేరింది. ఎఫ్‌ఐఐల జోరుతో గత వారం నిఫ్టీ 25,144 వద్ద లాభాలతో ముగిసినప్పటికీ ద్రవ్యోల్బణం రెండేళ గరిష్ఠ స్థాయి 6.09 శాతానికి చేరటం, ముడి చమురు సెగ, రూపాయి పతనం వంటివి వారాంతంలో బుల్స్‌కు పగ్గాలు వేశాయి. అయితే ఈ వారం మార్కెట్లు అత్యంత కీలకమైన కన్సాలిడేషన్ దశలోకి అడుగుపెట్టనున్నాయి. నిఫ్టీకి తక్షణ మద్దతు 25,000 వద్ద కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరల గమనం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల సంకేతాలు మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఈ వారం ఆటో, ఐటీ రంగాల కంటే పీఎ్‌సయూ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు దూకుడుగా కాకుండా కీలక మద్దతు స్థాయిల వద్ద నాణ్యమైన షేర్లను విడతల వారీగా ఎంచుకోవటమే ఉత్తమ వ్యూహం.
స్టాక్ రికమండేషన్స్
ప్రెసిషన్ వైర్స్ ఇండియా: సుదీర్ఘకాలంగా ఈ కౌంటర్ బుల్‌రన్ కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబరు మొదటి వారానికి ఏకంగా 145 శాతం రాబడిని అందించింది. జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత 27 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. మెరుగైన ఫండమెంటల్స్, టెక్నికల్స్, 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకోవటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.406 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.400 పై స్థాయిలో ప్రవేశించి రూ.525 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.380 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆర్‌ఆర్ కేబుల్: ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఏకంగా 130 శాతం రాబడిని అందించిన ఈ కౌంటర్ ఆ తర్వాత దిద్దుబాటుకు లోనైంది. దాదాపు 37ు మేర పతనమైంది. తాజా త్రైమాసిక ఫలితా లు, డివిడెండ్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.1,983 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,950 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.2,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,900 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్: ఐపీఓ ఆరంభం నుంచి ఈ షేరు బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. 2026 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 250 శాతం మేర రాబడిని అందించింది. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్ జరుగుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ పర్వాలేదు. గత శుక్రవారం రూ.507 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.500 శ్రేణిలో ఎంటరై రూ.630 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలి. రూ.470 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
యూనివర్సల్ కేబుల్స్: ఈ షేరు జీవితకాల గరిష్ఠానికి చేరిన తర్వాత 38 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేబుల్ రంగం యాక్టివ్ కావటం ఈ కౌంటర్‌ను ఆకర్షణీయంగా మార్చింది. గత శుక్రవారం రూ.1,199 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,200 పై స్థాయిలో ప్రవేశించి రూ.1,559 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,160 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మార్పెన్ లాబ్స్: కొన్ని నెలలుగా బుల్‌రన్‌ను కొనసాగిస్తున్న ఈ షేరు బ్రేకౌట్ తర్వాత గరిష్ఠానికి చేరింది. ఆ తర్వాత 25 శాతం మేర పుల్‌బ్యాక్‌కు లోనైంది. అయితే రిలేటివ్ స్ట్రెంత్ బలంగా ఉండటం, తక్కువ వాల్యూమ్ నమోదవుతుండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.99 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.98 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.125 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.95 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..