తగ్గిన వాణిజ్య లోటు
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:17 AM
ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి....
ఫిబ్రవరి ఎగుమతుల్లో స్వల్ప క్షీణత
యుద్ధ ప్రభావం తెలిసేది మార్చి గణాంకాల్లోనే...
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు కూడా 2,710 కోట్ల డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 3,468 కోట్ల డాలర్లుంది (రూ.3.19 లక్షల కోట్లు). ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైనందు వల్ల ఎగుమతులపై దాని ప్రభా వం ఎంత అన్నది మార్చి గణాంకాల్లోనే తెలుస్తుందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. ప్రపంచంలో ఆర్థిక సవాళ్లు విశేషంగా పెరిగిన వాతావరణంలో కూడా ఎగుమతుల రంగం మంచి పనితీరు ప్రదర్శిస్తోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెలలో దిగుమతులు 24.11ు పెరిగి 6,371 కోట్ల డాలర్లుగా (రూ.5.86 లక్షల కోట్లు) నమోదయ్యాయి.
ఇతర ముఖ్యాంశాలు...
బంగారం, వెండి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. బంగారం దిగుమతులు 218.55ు వృద్ధితో 744 కోట్ల డాలర్లకు (రూ.68,450 కోట్లు) చేరగా వెండి దిగుమతులు 285.23ు వృద్ధితో 166 కోట్ల డాలర్లకు (రూ.15,272 కోట్లు) చేరాయి.
ఆయిల్ దిగుమతులు 9ు వృద్ధితో 1,297 కోట్ల డాలర్లుగా (రూ.1.19 లక్షల కోట్లు) నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో (ఏప్రిల్-ఫిబ్రవరి) ఎగుమతులు 1.84ు పెరిగి 40,293 కోట్ల డాలర్లకు (రూ.37.07 లక్షల కోట్లు) చేరగా దిగుమతులు 8.53ు వృద్ధితో 71,353 కోట్ల డాలర్లకు (రూ.65.64 లక్షల కోట్లు) చేరాయి.
వాణిజ్య లోటు 31,060 కోట్ల డాలర్లుగా (రూ.28.58 లక్షల కోట్లు) నమోదైంది.
అమెరికా ఎగుమతుల్లో 13% క్షీణత
అధిక టారి్‌ఫల కారణంగా ఫిబ్రవరిలో అమెరికాకు ఎగుమతులు 12.88 శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కాలంలో అమెరికాకు ఎగుమతులు 688 కోట్ల డాలర్లు (రూ.63,290 కోట్లు)గా ఉన్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు 36.53 శాతం పెరిగి 448 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అయితే యుద్ధం కారణంగా ట్రంప్ సుంకాలను 10 శాతానికి తగ్గించటంతో మార్చి నెల ఎగుమతుల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి గాను అమెరికాకు ఎగుమతులు 3.84 శాతం వృద్ధి చెంది 7,929 కోట్ల డాలర్లకు చేరుకోగా దిగుమతులు 15.65 శాతం పెరుగుదలతో 4,840 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో చైనాతో వాణిజ్య లోటు ఏకంగా 10,000 కోట్ల డాలర్లు దాటిందని తెలిపింది. ఈ కాలంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 37.66 శాతం పెరిగి 1,754 కోట్ల డాలర్లకు చేరుకోగా దిగుమతులు 15.21 శాతం వృద్ధి చెంది 11,955 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వాణిజ్య లోటు 10,201 కోట్ల డాలర్లకు చేరుకుందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News