3 రోజుల తర్వాత లాభాల్లోకి..
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:13 AM
గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్‌లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...
సెన్సెక్స్ 938 పాయింట్లు అప్
మళ్లీ 75,000 పైకి ఇండెక్స్
23,400 ఎగువకి నిఫ్టీ
ముంబై: గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్‌లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో ఇన్వెస్టర్లు బ్లూచిప్ బ్యాంకింగ్ షేర్లలో వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 938.93 పాయింట్ల (1.26 శాతం) వృద్ధితో 75,502.85 వద్ద ముగిసింది. సూచీ 73,949.76 వద్ద నమోదు చేసిన ఇంట్రాడే కనిష్ఠ స్థాయితో పోలిస్తే 1553 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 257.70 పాయింట్ల (1.11ు) లాభంతో 23,408.80 వద్ద స్థిరపడింది. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.75,000 కోట్లకు పైగా పెరిగి రూ.430.57 లక్షల కోట్లకు (4.66 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
బంగారం, వెండి దిగొస్తున్నాయ్..
విలువైన లోహాల ధరలు క్రమంగా దిగొస్తు న్నాయి.ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.2,950 తగ్గి రూ.1,60,250 వద్దకు జారింది. కిలో వెండి రూ.9,000 తగ్గుదలతో రూ.2,26,500 ధర పలికింది. బులియన్ అంతర్జాతీయ విపణిలో వీటి ధర లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 5,000 డాలర్ల దిగువకు జారుకోగా.. సిల్వర్ 80 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు భగ్గుమంటున్న నేపథ్యంలో అమెరికన్ డాలర్లు, బాండ్లకు డిమాండ్ పెరిగింది. అలాగే, క్రూడ్ దెబ్బకు మార్కెట్లో వస్తు ధరలు పెరగవచ్చని, ధరాఘాతాన్ని కట్టడి చేసేందుకు అమెరికన్ ఫెడ్ రిజర్వ్ సహా ఆయా అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ప్రామాణిక వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చన్న అంచనాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్‌లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని విశ్లేషకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News