Share News

భారీగా తగ్గిన వెండి ధరలు.. కిలోకు రూ.5 వేల మేర కిందకు..

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:19 AM

వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. గత కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న వెండి ధర బుధవారం (నవంబర్ 11) మరోసారి పతనమైంది.

భారీగా తగ్గిన వెండి ధరలు.. కిలోకు రూ.5 వేల మేర కిందకు..
Silver Price Today

ఇంటర్నెట్ డెస్క్: వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. గత కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న వెండి ధర బుధవారం (నవంబర్ 11) మరోసారి పతనమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.4,700 తగ్గింది. 'గుడ్‌రిటర్న్స్' ప్రకారం.. కిలోకు రూ.5 వేల మేర తగ్గుదల నమోదైంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఊరట లభించింది (Silver Price Today).


బుధవారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్ గడువు వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.1,82,450 వద్ద నమోదైంది. అంతకుముందు ముగింపు ధర రూ.1,87,127 కాగా, ఒక్కరోజులోనే రూ.4,677 మేర తగ్గింది. అంటే దాదాపు 2.5 శాతం పతనమైంది. దేశీయ వెండి ధరలను వెల్లడించే 'గుడ్‌రిటర్న్స్' ప్రకారం.. కిలోకు రూ.5 వేల మేర తగ్గి రూ.2 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, వడ్డీ రేట్లపై అంచనాలు వెండి ధరలను ప్రభావితం చేస్తుంటాయి (Silver Price Crash).


కాగా, ఫ్యూచర్స్ మార్కెట్‌లో నమోదయ్యే ధరలకు, స్థానిక నగల దుకాణాల్లో విక్రయించే వెండి ధరలకు వ్యత్యాసం ఉంటుంది (Silver Rate November 11). పన్నులు, తయారీ ఛార్జీలు, స్థానిక డిమాండ్ ఆధారంగా తుది ధర మారుతుంది. అందువల్ల కొనుగోలుకు ముందు స్థానిక మార్కెట్‌లో ధరలను నిర్ధారించుకోవాలి. ఇక, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ధరల హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి బదులుగా మార్కెట్ పరిస్థితులను బట్టి విడతల వారీగా కొనుగులు చేయడం మంచిదని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 10:19 AM