Share News

మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలే ముఖ్యం

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:07 AM

టాటా స్టీల్‌-ఏపీఎల్‌ అపోలో మధ్య ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలకు సంబంధించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలే ముఖ్యం
sebi

  • టాటా స్టీల్‌ -ఏపీఎల్‌ అపోలో డీల్‌పై కన్నేశాం..

  • సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌-ఏపీఎల్‌ అపోలో మధ్య ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలకు సంబంధించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను కాపాడటమే తమకు అత్యంత ముఖ్యమని మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే శుక్రవారం పేర్కొన్నారు. టేకోవర్‌, ఓపెన్‌ ఆఫర్‌ వంటి అంశాలు ఉన్నందున ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని అసోచామ్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో చెప్పారు. ప్రతిపాదిత లావాదేవీ స్వరూపం, విలువ నిర్ధారణ, ఏపీఎల్‌ అపోలో మైనారిటీ వాటాదారులకు కల్పించాల్సిన రక్షణల విషయంలో ప్రాక్సీ అడ్వైజరీ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సెబీ చైర్మన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌లో ప్రమోటర్ల మొత్తం వాటా 26.6 శాతాన్ని రూ.15,510 కోట్లకు కొనుగోలు చేసే డీల్‌ను టాటా స్టీల్‌ సోమవారం ప్రకటించింది. మరో 26శాతం వాటాను రూ.16,756 కోట్లతో ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ డీల్‌ను నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంది.


ఐపీఓలో రిటైల్‌ ఇన్వెస్టర్‌

పెట్టుబడి పరిమితి పెంచే చాన్స్‌

తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల పెట్టుబడి పరిమితి పెంపు అవకాశాలను సెబీ పరిశీలిస్తోంది. 25ఏళ్లకుపైగా ఈ పరిమితి మారలేదు. అయితే, రిటైల్‌ ఇన్వెస్టర్లు సాధారణంగా ఒక లాట్‌కు దరఖాస్తు చేస్తుంటారని, ఇందుకు సుమారుగా రూ.15 వేలు ఖర్చవుతుందని సెబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీవన్‌ సోన్‌పరోటే పేర్కొన్నారు. దీంతో పరిమితిని సవరించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని సెబీ ఇప్పటి వరకు భావించినట్టు చెప్పారు. పెట్టుబడి పరిమితిని రూ.5 లక్షలకు పెంచినా ఐపీఓల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడి మొత్తంలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

Updated Date - Nov 28 , 2026 | 01:07 AM