ఎంఎస్‌ఎంఈ డ్రీమ్’ ద్వారా రూ.50 కోట్ల వరకు రుణం: ఎస్‌బీఐ
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:22 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ఎస్‌బీఐ మరింత చేయూతనివ్వనుంది
ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ఎస్‌బీఐ మరింత చేయూతనివ్వనుంది. ‘ఎంఎస్‌ఎంఈ డ్రీమ్’ ద్వారా ఒక్కో సంస్థకు ఆన్‌లైన్‌లో మంజూరు చేసే రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచనున్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తుం డడంతో.. వాటికి మరింత రుణ సాయాన్ని అందించ నున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నెల రోజుల్లోనే పరిమితిని రూ.10 కోట్లకు, ఆ తర్వాత క్రమంగా రూ.50 కోట్లకు పెంచనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్