River Mobility Electric Scooters: విస్తరణ బాటలో రివర్ మొబిలిటీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:49 AM
ఇండీ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న రివర్ మొబిలిటీ తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండీ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న రివర్ మొబిలిటీ తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అత్తాపూర్, ఆర్‌సీ పురం, హైటెక్ సిటీల్లో మూడు కొత్త స్టోర్లు ప్రారంభించింది. దీంతో తెలంగాణలో తమ స్టోర్ల సంఖ్య ఆరుకు చేరినట్టు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ మణి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తమకు ఏడు స్టోర్లు ఉన్నట్టు చెప్పారు. తమ వ్యాపార వృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలది కీలక పాత్ర అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 స్టోర్లు ఉండగా మార్చి చివరికల్లా వీటిని 80కి చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. గత రెండేళ్లలో తమ కంపెనీ దేశ వ్యాప్తంగా 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్టు తెలిపారు. ఒకసారి చార్జింగ్‌తో 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నారు. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో కొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు మణి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి