Retail Inflation India: మళ్లీ ధరల సెగ షురూ
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:38 AM
దేశంలో మళ్లీ ధరల సెగ ప్రారంభమైంది. గత నెల (డిసెంబరు 2025) రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి 1.33 శాతానికి చేరింది. గత ఏడాది నవంబరులో నమోదైన 0.71 శాతంతో...
డిసెంబరు ద్రవ్యోల్బణం 1.33 శాతం
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ ధరల సెగ ప్రారంభమైంది. గత నెల (డిసెంబరు 2025) రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి 1.33 శాతానికి చేరింది. గత ఏడాది నవంబరులో నమోదైన 0.71 శాతంతో పోలిస్తే ఇది 0.62 శాతం ఎక్కువ. అయితే 2024 డిసెంబరులో నమోదైన 5.22 శాతంతో పోలిస్తే మాత్రం 3.89 శాతం తక్కువ. పర్సనల్ కేర్, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పుల ధరలు పెరగడంతో డిసెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ప్రకటించింది. డిసెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి 1.33 శాతానికి చేరినా, ఇది ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన రెండు శాతం కనిష్ఠ స్థాయి కంటే దిగువనే ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం దిగువన నమోదవడం వరుసగా ఇది నాలుగో నెల.
ఐదు రాష్ట్రాల్లో ధరల సెగ ఎక్కువే: దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే డిసెంబరులో ఐదు రాష్ట్రాల్లో ధరల సెగ ఎక్కువగా ఉందని ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం కేరళలో అత్యధికంగా 9.49 శాతం శాతం ఉండగా కర్ణాటకలో 2.99 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.71 శాతం, తమిళనాడులో 2.67 శాతం, జమ్మూకశ్మీర్‌లో 2.26 శాతం చొప్పున నమోదైంది. అసోం, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి ధరల సెగ లేదు. ఈ రాష్ట్రాల్లో గత నెల ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్) నమోదైంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి