Reliance Shares Plunge: రిలయన్స్ షేర్లు పడేశాయ్..
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:17 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ట్రంప్ సుంకాల పెంపు హెచ్చరికల నేపథ్యంలో మార్కెట్...
సెన్సెక్స్ 376 పాయింట్లు పతనం
26,200 దిగువ స్థాయికి నిఫ్టీ
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ట్రంప్ సుంకాల పెంపు హెచ్చరికల నేపథ్యంలో మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. మంగళవారం ఒక దశలో సెన్సెక్స్ 540 పాయింట్ల మేర పతనమై 85,000 కీలక స్థాయిని సైతం కోల్పోయింది. చివర్లో సూచీ కాస్త కోలుకున్నప్పటికీ, 376.28 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 71.60 పాయింట్లు కోల్పోయి 26,178.70 వద్ద స్థిరపడింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.21 లక్షల కోట్లు తగ్గి రూ.479.59 లక్షల కోట్లకు పడిపోయింది.
ఆర్‌ఐఎల్‌కు రూ.లక్ష కోట్ల నష్టం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు బీఎ్‌సఈలో ఒక దశలో 5 శాతం క్షీణించి రూ.1,497.05 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు పైగా పతనమైంది. గడిచిన 8 నెలలకు పైగా కాలంలో కంపెనీ షేరుకిది అతిపెద్ద ఇంట్రాడే నష్టం. రిలయన్స్ షేరు మళ్లీ కాస్త కోలుకున్నప్పటికీ, చివరికి 4.42 శాతం నష్టంతో రూ.1,507.70 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.94,388.99 కోట్ల తగ్గుదలతో రూ.20.40 లక్షల కోట్లకు పరిమితమైంది. రష్యా నుంచి మూడు నౌకల ముడి చమురు జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి తరలివస్తోందంటూ బ్లూంబర్గ్‌లో వచ్చిన కథనాన్ని సంస్థ ఖండించింది. దాదాపు 3 వారాలుగా రష్యా నుంచి చమురును అందుకోలేదని, ఈ నెలలోనూ అలాంటి అవకాశం లేదని రిలయన్స్ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి