Rainbow Trout: రూ.50 కోట్లతో రెయిన్‌బో ట్రౌట్ చేపల కేంద్రం
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:46 AM
హైదరాబాద్ కేం ద్రంగా ఉన్న స్మార్ట్‌గ్రీన్ ఆక్వాకల్చర్ (ఎస్‌జీఏ).. శీతల ప్రాంతాల్లో పెరిగే రెయిన్‌బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది...
స్మార్ట్‌గ్రీన్ ఆక్వాకల్చర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేం ద్రంగా ఉన్న స్మార్ట్‌గ్రీన్ ఆక్వాకల్చర్ (ఎస్‌జీఏ).. శీతల ప్రాంతాల్లో పెరిగే రెయిన్‌బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం గూడూరు వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉష్ణ మండల ప్రాంతంలో ఈ తరహా చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం దేశంలో ఇదే తొలిసారి. సోమవారం నాడు ఈ రెయిన్‌బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. శీతల ప్రాంతాల్లో పెరిగే ఈ చేపలను ఇక్కడ అదే వాతావరణంలో రీసర్క్యూలేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్‌ఏఎస్) విధానంలో పెంచుతున్నట్లు ఎస్‌జీఏ వ్యవస్థాపకుడు, ఎండీ ఆదిత్య రిత్విక్ నర్రా వెల్లడించారు. రూ.50 కోట్లతో ఐదెకరాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,200 మెట్రిక్ టన్నులని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి