Share News

Premier Energies Expansion: రూ.11,000 కోట్లతో విస్తరణ

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:41 AM

Premier Energies to Invest Rupees 11000 Crore Set Up Cell Manufacturing Plant in Andhra Pradesh

Premier Energies Expansion: రూ.11,000 కోట్లతో విస్తరణ

ఏపీలో సెల్‌ తయారీ ప్లాంట్‌

ప్రీమియర్‌ ఎనర్జీస్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ప్రీమియర్‌ ఎనర్జీస్‌ పెద్దఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం రూ.11,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీఓ) వినయ్‌ రుస్తగీ వెల్లడించారు. ఇందులో ఇప్పటికే రూ.1,300 కోట్లను కంపెనీ గత ఏడాది ఐపీఓ ద్వారా సమీకరించింది. మరో రూ.2,200 కోట్లు ఇరెడా నుంచి రుణాల రూపంలో, మిగతా మొత్తాన్ని అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనుంది. దీంతో తమ సెల్స్‌, మాడ్యూల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యం రెట్టింపవుతాయన్నారు. ప్రీమియర్‌ ఎనర్జీ హైదరాబాద్‌ సమీపం లో ఏటా 3.2 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న సెల్స్‌, 5.1 గిగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న మాడ్యూల్స్‌ తయారు చేస్తోంది. ఈ విస్తరణతో తమ వార్షిక సెల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యం 3.2 గిగావాట్ల నుంచి 10.6 గిగావాట్లకు, మాడ్యూల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యం 5.1 గిగావాట్ల నుంచి 11.1 గిగావాట్లకు చేరుతుందని పెరుగుతుందన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 7.4 గిగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో సెల్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు రుస్తగీ చెప్పారు. ప్రీమియర్‌ ఎనర్జీకి ఇప్పటికే వివిధ దేశీయ కంపెనీల నుంచి రూ.13,000 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 06:41 AM