Share News

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

ABN , Publish Date - May 13 , 2026 | 01:05 PM

కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి దాదాపు 15-16 శాతం వరకు పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు బంగారం కొనడం సంస్కృతిలో భాగమైందని, ధరలు పెరిగినా..

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి దాదాపు 15-16 శాతం వరకు పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు బంగారం కొనడం సంస్కృతిలో భాగమైందని, ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.


చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందుంటుందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడం ద్వారా బంగారం దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ, ఇది ‘రివర్స్ సైకాలజీ’లా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ధరలు పెరిగే కొద్దీ భారతీయుల్లో బంగారం కొనాలనే ఆసక్తి మరింత పెరగొచ్చని ఆయన పేర్కొన్నారు.


అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో సుమారు రూ.40 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందని భాను ప్రకాష్ కోగంటి తెలిపారు. ప్రజలు తమ డబ్బును సరైన పెట్టుబడుల వైపు మళ్లించేలా ప్రభుత్వం మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు బంగారం రంగంపై ఆధారపడి జీవించే స్వర్ణకారుల జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

‘ఈ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ భాను ప్రకాష్ కోగంటి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

Updated Date - May 13 , 2026 | 01:05 PM