పిజ్జా హట్‌కు గుడ్‌బై చెబుతున్న యమ్ బ్రాండ్స్.. రూ.25 వేల కోట్లకు అమ్మకం..
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:47 PM
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిజ్జా హట్ రెస్టారెంట్స్ చైన్ యాజమాన్యం మారబోతోంది. కేఎఫ్‌సీ, టాకో బెల్ వంటి బ్రాండ్లకు కూడా మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ పిజ్జా హట్‌ను అమ్మడానికి సిద్ధమవతుోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిజ్జా హట్ రెస్టారెంట్స్ చైన్ యాజమాన్యం మారబోతోంది. కేఎఫ్‌సీ, టాకో బెల్ వంటి బ్రాండ్లకు కూడా మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ (Yum! Brands) పిజ్జా హట్‌ను మొత్తం 2.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.25 వేల కోట్లు) విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకాన్ని రెండు వేర్వేరు ఒప్పందాల ద్వారా పూర్తి చేయనుంది. (Pizza Hut sale).
ఒప్పందం ప్రకారం.. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిజ్జా హట్ వ్యాపారాన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ లాంగ్‌రేంజ్ క్యాపిటల్ (LongRange Capital) 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. అలాగే చైనాలోని 4,375 పిజ్జా హట్ రెస్టారెంట్లను యమ్ చైనా హోల్డింగ్స్ 1.2 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకోనుంది. గత కొన్నేళ్లుగా పిజ్జా హట్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరల పెరుగుదల, వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పులు కంపెనీపై ప్రభావం చూపాయి (Global pizza chain).
ముఖ్యంగా అమెరికాలో పిజ్జా హట్ అమ్మకాలు కొన్నేళ్లుగా క్షీణిస్తూ వస్తున్నాయి (Pizza Hut acquisition). ప్రపంచంలోని అనేక మార్కెట్లలో పిజ్జా హట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, చైనాలో మాత్రం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. స్థానిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మెనూలు రూపొందించడం, కొత్త స్టోర్ మోడళ్లను ప్రవేశపెట్టడం వల్ల అక్కడి వ్యాపారం బలంగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..
సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..