Share News

‘బీమా’లోకి పతంజలి ఆయుర్వేద్‌

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:09 AM

బాబా రాందేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. కొత్తగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది...

‘బీమా’లోకి పతంజలి ఆయుర్వేద్‌

న్యూఢిల్లీ: బాబా రాందేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. కొత్తగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈక్విటీలో 73.6 శాతం వాటాను కొనుగోలు చేసింది. బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ ఈ కొనుగోలుకు ఆమోదం కూడా తెలిపింది. మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈక్విటీలో మరో 24.5 శాతం వాటాను రజనీగంధ పాన్‌ మసాలా తయారీ కంపెనీ డీఎస్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. అదర్‌ పూనావాలాతో పాటు ఇతర ఇన్వెస్టర్ల నుంచి పతంజలి ఆయుర్వేద్‌, డీఎస్‌ గ్రూప్‌ ఈ వాటాలను కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తం మీద యోగా గురువు బాబా రాందేవ్‌ బీమా రంగంలోకి అడుగు పెట్టడం ద్వారా ఇతర బీమా కంపెనీలకు పోటీ ఇవ్వబోతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:09 AM