మోదీ 'మెలోడీ' గిఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు..
ABN , Publish Date - May 20 , 2026 | 09:51 PM
ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు.
ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా మెలోనీకి ఒక బహుమతి అందించారు. 'మెలోడీ' పేరుతో ఉన్న చాక్లెట్లను మెలోనీకి మోదీ అందించారు (Parle Industries shares).
ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీకి 'మెలోడీ' చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పార్లే ఇండస్ట్రీస్ సంస్థ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మంగళవారం కంపెనీ షేరు 5% దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అయితే ఇందులో ట్విస్ట్ ఎంటంటే.. 'మెలోడీ' చాక్లెట్లను తయారు చేసేది పార్లే ఇండస్ట్రీస్ సంస్థ కాదు.. పార్లే ప్రొడక్ట్స్ సంస్థ (Melody toffee Modi Meloni).
ముంబై వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న పార్లే ప్రొడక్ట్స్ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు (Parle stock rise). పార్లే పేరు ఉండడంతో మదుపర్లు అయోమయానికి గురై పార్లే ఇండస్ట్రీస్ షేర్లపై ఆసక్తి చూపించారు. ఒక్క బుధవారమే ఈ సంస్థకు చెందిన 8 లక్షల షేర్లు చేతులు మారాయి. సాధారణంగా ఈ సంస్థ షేర్లు నెలకు సగటున 3 లక్షల షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతుంటాయి.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..