Share News

ఓలా ఎలక్ట్రిక్‌కు మిశ్రమ ఫలితాలు.. భారీగా తగ్గిన ఆదాయం.. నష్టాలూ తగ్గాయ్..

ABN , Publish Date - May 20 , 2026 | 09:32 PM

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది.

ఓలా ఎలక్ట్రిక్‌కు మిశ్రమ ఫలితాలు.. భారీగా తగ్గిన ఆదాయం.. నష్టాలూ తగ్గాయ్..
Ola Electric Q4 results

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈవీ మార్కెట్లో పోటీ పెరగడం, డిమాండ్ మందగించడం, డెలివరీలు తగ్గడం ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి (Ola Electric Q4 results).


ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నాలుగో త్రైమాసికం నికర నష్టం రూ.500 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.870 కోట్ల నష్టం చవిచూసింది. గతేడాదితో పోలిస్తే నష్టాలు సుమారు 42.5 శాతం తగ్గాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే (రూ.611 కోట్లు) కంపెనీ ఆదాయం దాదాపు 57% మేర పడిపోయి రూ. 265 కోట్లకు చేరింది (Ola Electric loss 2026).


ఈ త్రైమాసికంలో సుమారు 20,256 వాహనాలను మాత్రమే ఓలా డెలివరీ చేయగలిగింది (Ola EV sales). ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.73 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. కాగా, కంపెనీ ఖర్చులు తగ్గించడం, మార్జిన్లు మెరుగుపరచడం, బ్యాటరీల తయారీపై దృష్టి పెట్టినట్లు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. రాబోయే కాలంలో అమ్మకాలు మళ్లీ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..


చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 20 , 2026 | 09:32 PM