Share News

న్యూసిలియాన్‌తో పాండోరమ్‌ జట్టు

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:04 AM

రీజెనరేటివ్‌ ఔషధాల తయారీలోని పాండోరమ్‌ టెక్నాలజీస్‌.. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టు పరిశోధన, అభివృద్ధి...

న్యూసిలియాన్‌తో పాండోరమ్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రీజెనరేటివ్‌ ఔషధాల తయారీలోని పాండోరమ్‌ టెక్నాలజీస్‌.. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టు పరిశోధన, అభివృద్ధి, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ న్యూసిలియాన్‌ థెరాప్యుటిక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో పాండోరమ్‌ టెక్నాలజీస్‌ ఎక్సోసోమ్‌ ఆధారిత కురాజెన్‌ ఎక్స్‌ తయారీ సామర్థ్యాల పెంపునకు న్యూసిలియాన్‌ టెక్నాలజీస్‌ సహకరించాల్సి ఉంటుంది. తాము క్లినికల్‌ ట్రయల్స్‌ దిశగా అడుగు వేస్తున్న దశలో ఈ భాగస్వామ్యం ఒక విశేషమైన అడుగుగానే నిలుస్తుందని పాండోరమ్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ తుహిన్‌ భౌమిక్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి..

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2026 | 06:04 AM