Share News

జీతం స్లిప్ లేదా.. అయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు..

ABN , Publish Date - Sep 01 , 2026 | 08:42 PM

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు.

జీతం స్లిప్ లేదా.. అయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు..
credit card without salary slip

ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. జీతం స్లిప్‌లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్‌నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip).


క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్‌లు లేని వారికి బ్యాంక్ స్టేట్‌మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card).


వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్‌టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof).

CREDIT.jpg


గిగ్ ఎకానమీలో పనిచేసేవారికి ఆదాయం తరచూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వస్తుంది. డెలివరీ, క్యాబ్, ఫ్రీలాన్స్ లేదా ఇతర ఆన్‌లైన్ సేవల ద్వారా వచ్చిన చెల్లింపుల రికార్డులు కూడా ఆదాయ స్థిరత్వాన్ని చూపించడంలో సహాయపడవచ్చు. అయితే ప్రతి బ్యాంకు ఇటువంటి రికార్డులను ఒకే విధంగా పరిగణించదు. అందువల్ల దరఖాస్తు చేసే ముందు సంబంధిత బ్యాంకుకు సమర్పించాల్సిన పత్రాల గురించి తెలుసుకోవడం మంచిది (Self employed credit card eligibility).


జీతం స్లిప్ లేదా ఇతర ఆదాయ పత్రాలు అందుబాటులో లేకపోతే మరో మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) ఆధారంగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం. ఈ విధానంలో బ్యాంకులో ఎఫ్‌డీ ఉంచి, దాని ఆధారంగా క్రెడిట్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎఫ్‌డీ మొత్తం, కార్డు పరిమితి, ఇతర నిబంధనలు బ్యాంకును బట్టి మారుతాయి. ఆదాయ రుజువుతో పాటు క్రెడిట్ హిస్టరీ, రీపేమెంట్ రికార్డు, ఇప్పటికే ఉన్న రుణాలు, క్రెడిట్ వినియోగం వంటి అంశాలు కూడా కార్డు ఆమోదంలో ప్రభావం చూపుతాయి.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..


విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..

Updated Date - Sep 01 , 2026 | 08:42 PM