Share News

బడ్జెట్ 2026-27: దేశ వ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లు

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:15 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బడ్జెట్ 2026-27: దేశ వ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లు
high-speed rail corridors

  • కొత్తగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు

  • హైదరాబాద్‌-పుణె, హైదరాబాద్‌- బెంగళూరు మధ్య కారిడార్లు

  • హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి కారిడార్లు

  • కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు: నిర్మల

  • పరిశ్రమలు-విద్యాసంస్థలకు అనుసంధానం: నిర్మల

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా పర్యావరణ పరిరక్షణకు, అలానే ప్రయాణీకుల రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. పుణె-హైదరాబాద్, ముంబై-పుణె, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సలిగుడి మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించునున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. త్వరలో వివిధ ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడు కొత్త హై- స్పీడ్ రైలు కారిడార్లు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ, పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానిస్తాయి. అలానే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, ఇదే సమయంలో రోడ్లు, సాధారణ రైలు నెట్‌వర్క్‌లపై ఒత్తిడిని తగ్గిస్తాయని కేంద్రం భావిస్తోంది.


ప్రతిపాదిత 7 నగరాల మధ్య హైస్పీడ్‌ కారిడార్లు

  1. ముంబై-పుణె

  2. పుణె-హైదరాబాద్‌

  3. హైదరాబాద్‌-బెంగళూరు

  4. హైదరాబాద్‌-చెన్నై

  5. చెన్నై- బెంగళూరు

  6. ఢిల్లీ-వారణాసి

  7. వారణాసి -సిలిగుడి

Updated Date - Feb 01 , 2026 | 12:49 PM