Share News

కొత్త UPI మార్గదర్శకాలు: ఎవరికి ఛార్జీలు? ఎవరికి ఉచితం?

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:08 PM

కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నూతన UPI నిబంధనల ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు (P2P) పూర్తిగా ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 కొత్త UPI మార్గదర్శకాలు: ఎవరికి ఛార్జీలు? ఎవరికి ఉచితం?
New UPI Rules: Zero Charges on P2P Payments, ₹2,000 Merchant Limit

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 15: కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నూతన UPI నిబంధనల ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు (P2P) పూర్తిగా ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్సన్ టు పర్సన్ లావాదేవీలు 100శాతం ఉచితం. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి ఎంత మొత్తం పంపినా (రూపాయల పరిమితి లేకుండా) ఎలాంటి చార్జీలు, హిడెన్ ఫీజులు ఉండవని కేంద్రం తేల్చి చెప్పింది.


చిన్న వ్యాపారులకు మినహాయింపు (రూ.2,000 వరకు): వ్యాపారులతో చేసే లావాదేవీల (P2M) విభాగంలో రూ.2,000 వరకు ఎలాంటి MDR చార్జీలు ఉండవు. అలాగే నెలకు లక్ష రూపాయల వరకు UPI QR ద్వారా పొందే చిన్న వీధి వ్యాపారులకు (P2PM) కూడా జీరో-MDR మినహాయింపు ఉంటుంది.

రూ. 2,000 దాటితే చార్జీలు (P2M): రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ లావాదేవీలపై 0.4శాతం MDR విధిస్తారు (గరిష్ఠంగా రూ.300 క్యాపింగ్ ఉంటుంది).

రైల్వేలు, పెట్రోల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలు: రూ.2,000 దాటిన లావాదేవీలకు శ్లాబ్ శాతం కాకుండా కేవలం రూ. 5 ఫ్లాట్ ఫీజు వర్తిస్తుంది.

వినియోగదారులపై భారం పడదు: యాప్ ప్రొవైడర్లు ప్లాట్‌ఫామ్ ఫీజులు వేయకూడదని, వ్యాపారులు ఈ MDR భారాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 09:37 PM