Share News

నవ గ్లోబల్‌ నుంచి రూ.450 కోట్లు

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:40 AM

సింగపూర్‌లోని అనుబంధ సంస్థ నవ గ్లోబల్‌ పీటీఈ లిమిటెడ్‌ షేర్ల బైబ్యాక్‌ నవ లిమిటెడ్‌కు కలిసి రానుంది. ఈ బైబ్యాక్‌ ద్వారా...

నవ గ్లోబల్‌ నుంచి రూ.450 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సింగపూర్‌లోని అనుబంధ సంస్థ నవ గ్లోబల్‌ పీటీఈ లిమిటెడ్‌ షేర్ల బైబ్యాక్‌ నవ లిమిటెడ్‌కు కలిసి రానుంది. ఈ బైబ్యాక్‌ ద్వారా తమకు ఐదు కోట్ల అమెరికా డాలర్ల (సుమారు రూ.450 కోట్లు) నగదు అందుతుందని నవ లిమిటెడ్‌ ప్రకటించింది. నవ గ్లోబల్‌ పీటీఈ లిమిటెడ్‌ కంపెనీ.. నవ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ కంపెనీ. ఈ బైబ్యాక్‌ తర్వాత కూడా సింగపూర్‌ అనుబంధ సంస్థ ఈక్విటీలో తమకు 100 శాతం ఈక్విటీ వాటా ఉంటుందని తెలిపింది. ఇండిపెండెంట్‌ వాల్యుయేషన్‌ ప్రకారమే నవ గ్లోబల్‌ పీటీఈ లిమిటెడ్‌ కంపెనీ తన షేర్ల బైబ్యాక్‌ ప్రకటించిందని నవ లిమిటెడ్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:40 AM