మారుతి సుజుకీ లాభాలకు గండి
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:03 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1).. దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)కు పెద్దగా కలిసిరాలేదు. ఈ కాలానికి కంపెనీ...
క్యూ1లో రూ.3,447 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1).. దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)కు పెద్దగా కలిసిరాలేదు. ఈ కాలానికి కంపెనీ అనుబంధ సంస్థలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.52,469.80 కోట్ల ఆదాయంపై రూ.3,446.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 35.9 శాతం పెరిగినా, నికర లాభం మాత్రం 9.11 శాతం తగ్గింది. క్యూ1లో కంపెనీ వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరినా, ఖర్చులు రూ.35,585 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెరిగిపోవడం లాభాలను దెబ్బతీశాయి.
అమ్మకాలు అదుర్స్: జూన్ త్రైమాసికంలో కంపెనీ రికార్డు స్థాయిలో 6,82,724 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.3 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే చిన్న కార్ల విక్రయాలు 34.1 శాతం, ఎస్‌యూవీల అమ్మకాలు 44.6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకీ మార్కెట్ వాటా 38.9 శాతం నుంచి 41.2 శాతానికి పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News