Share News

Indian Stock Market Recover: పడి ‘లేచిన’ మార్కెట్లు

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:45 AM

ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కొద్దిగా కోలుకున్నాయి. ఆరంభంలో ఒక దశలో సెన్సెక్స్‌ 715.17 పాయింట్లు, నిఫ్టీ 209.9 పాయింట్ల వరకు...

Indian Stock Market Recover: పడి ‘లేచిన’ మార్కెట్లు

  • ఆరంభంలో సెన్సెక్స్‌ 715 పాయింట్లు డౌన్‌

  • చివరకు 302 పాయింట్ల లాభంతో ముగింపు

ముంబై: ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కొద్దిగా కోలుకున్నాయి. ఆరంభంలో ఒక దశలో సెన్సెక్స్‌ 715.17 పాయింట్లు, నిఫ్టీ 209.9 పాయింట్ల వరకు నష్టపోయాయి. అయితే భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలపై భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్‌ చేసిన వ్యాఖ్యలతో సూచీలు రేసు గుర్రా ల్లా పరిగెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 301.93 పాయింట్ల లాభంతో 83,878.17 వద్ద క్లోజవగా నిఫ్టీ 106.95 పాయింట్లు లాభపడి 25,790.25 వద్ద ముగిసింది. ఇంట్రాడే 82,861.07 పాయింట్ల కనిష్ఠ స్థాయితో పోలిస్తే సెన్సెక్స్‌ సోమవారం 1,000 పాయింట్లకు పైగా కోలుకుంది.

15న మార్కెట్లకు సెలవు

మహారాష్ట్ర పురపాలిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15వ తేదీన (గురువారం) బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు ప్రకటించారు. ఫారెక్స్‌, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.

డీప్‌ఫేక్‌ వీడియోపై జర జాగ్రత్త: బీఎ్‌సఈ

బీఎ్‌సఈ సీఈఓ, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లను సిఫారసు చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియో డీప్‌ఫేక్‌ వీడియో అని బీఎ్‌సఈ తేల్చింది. ఇలాంటి మోసపూరిత, అనధికారిక వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మదుపరులను హెచ్చరించింది. తమ అధికారులు ఎవరికీ స్టాక్‌ మార్కెట్‌ టిప్స్‌ అందించే అధికారం లేదని స్పష్టం చేసింది. ఒక వాట్సప్‌ చానల్‌లో చేరడం ద్వారా ఈ పెట్టుబడుల టిప్స్‌ అందుకుని బ్రహ్మాండమైన లాభాలు పొందవచ్చని తమ సీఈఓ చెబుతున్నట్టు వచ్చిన ఈ వీడియో ముమ్మాటికీ డీప్‌ఫేక్‌ అని తేల్చిపారేసింది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 06:45 AM