Mahindra XUV 7X0 Launch: మార్కెట్లోకి మహీంద్రా 7ఎక్స్‌ఓ
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:19 AM
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. మార్కెట్లోకి సరికొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.13.66 లక్షలు...
ప్రారంభ ధర రూ.13.66 లక్షలు
జైసల్మేర్: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. మార్కెట్లోకి సరికొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్‌షోరూమ్). డావిన్సీ సస్పెన్షన్ సిస్టమ్, ట్రిపుల్ స్ర్కీన్, అడాస్ లెవల్ 2తో దీన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న ఈ ఎస్‌యూవీ డెలివరీలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొంది. 2021లో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఎక్స్‌యూవీ 700 ఈ విభాగంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించగా తాజాగా విడుదల చేసిన 7ఎక్స్‌ఓకు అదే స్థాయిలో స్పందన వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఎం అండ్ ఎం ఈడీ, సీఈఓ రాజేశ్ జెజురికర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి