Share News

రూ.30 లక్షల కోట్లు తుడిచిపెట్టేసిన ఇరాన్ యుద్ధం.. ఒక్క రోజులోనే మదుపర్ల నష్టం ఎంతంటే..

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:04 PM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం భారత ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

రూ.30 లక్షల కోట్లు తుడిచిపెట్టేసిన ఇరాన్ యుద్ధం.. ఒక్క రోజులోనే మదుపర్ల నష్టం ఎంతంటే..
Iran war impact on stock market

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం భారత ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు ఆవిరైంది (Iran war impact on stock market).


పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ఆర్థిక ప్రభావం అనే అంచనాలు, విదేశీ నిధుల మళ్లింపు మొదలైన భయాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సోమవారం (మార్చి 9) ఒక్క రోజే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది (Dalal Street losses).

crash2.jpg


బ్రెంట్ ముడి చమురు ధర ఒక్క వారంలో 25 శాతం కంటే ఎక్కువ పెరిగి, బ్యారెల్‌కు 114 డాలర్లు దాటింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా భారత్‌పై ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే మన దేశ ముడి చమురు అవసరాలు దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుతాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తప్పదు అనే అంచనాలతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిధులను మళ్లిస్తున్నారు (₹30 lakh crore wiped out).


గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల నుంచి దాదాపు రూ.21,000 కోట్లు ఉపసంహరించుకున్నారు (Indian stock market crash). ఇది గత 17 నెలల్లో అత్యధికం. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు రంగ సంస్థలతో పాటు బ్యాంకింగ్, విమానయాన, ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు కూడా భారీగా నష్టపోయాయి. ఒక్క డిఫెన్స్ రంగ స్టాక్‌లు తప్ప మిగిలిన అన్ని రంగాలూ నష్టాలనే చవిచూశాయి. ఈ యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే నష్టం అంత తీవ్రంగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

Updated Date - Mar 09 , 2026 | 02:12 PM