Share News

Pharmexcil: 2030 నాటికి ఫార్మా పరిశ్రమ రూ.12 లక్షల కోట్లకు

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:43 AM

దేశ ఫార్మా పరిశ్రమ జోరుకు తిరుగు లేదని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) కేంద్ర ప్రభుత్వానికి...

Pharmexcil: 2030 నాటికి ఫార్మా పరిశ్రమ రూ.12 లక్షల కోట్లకు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశ ఫార్మా పరిశ్రమ జోరుకు తిరుగు లేదని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ప్రస్తుతం 6,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న పరిశ్రమ టర్నోవర్‌ 2030 నాటికి 13,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.12 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌కు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం 9.4 శాతం వృద్ధి రేటుతో 3,047 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.74 లక్షల కోట్లు) చేరిన ఔషధ ఎగుమతులు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత పెరుగుతాయని కూడా వివరించింది. ప్రస్తుతం దాదాపు 150కు పైగా దేశాలు మన దేశం నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:43 AM