Share News

పండగ సీజన్‌లో పసిడి కొనుగోళ్లు రూ.72,000 కోట్లు

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:14 AM

భారతీయులకు బంగారం పై ప్రీతికిదే నిదర్శనం. ఈ ధనత్రయోదశి, దీపావళి సీజన్‌లో మనోళ్లు ఏకంగా రూ.72,000 కోట్ల విలువైన 52 టన్నుల బంగారం, రూ.5,400 కోట్ల విలువైన 300 టన్నుల వెండి కొనుగోలు చేశారు

పండగ సీజన్‌లో పసిడి కొనుగోళ్లు రూ.72,000 కోట్లు
gold

  • 300 టన్నులకు వెండి విక్రయాలు

భారతీయులకు బంగారం పై ప్రీతికిదే నిదర్శనం. ఈ ధనత్రయోదశి, దీపావళి సీజన్‌లో మనోళ్లు ఏకంగా రూ.72,000 కోట్ల విలువైన 52 టన్నుల బంగారం, రూ.5,400 కోట్ల విలువైన 300 టన్నుల వెండి కొనుగోలు చేశారు. గత ఏడాది పండగ సీజన్‌తో పోలిస్తే, ఈసారి పసిడి కొనుగోళ్ల పరిమాణం 30 శాతం, వెండి కొనుగోళ్లు 10 శాతం పెరిగాయని ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) తెలిపింది. గత దీపావళి సీజన్‌లో రూ.1.8 లక్షల స్థాయిలో ఉన్న 10 గ్రాముల గోల్డ్‌ రేటు ఈసారి పండగ నాటికి 21 శాతం మేర తగ్గి రూ.1.42 లక్షలకు దిగిరావడం ఇందుకు దోహదపడిందని, కార్తీక మాసంలో పెళ్లి కోసం ముందస్తు కొనుగోళ్లు మరింత తోడ్పడ్డాయని అసోసియేషన్‌ పేర్కొంది. దాంతో జువెలరీ విక్రయాలు 25 శాతం పెరిగాయని వెల్లడించింది.

వజ్రం మిలమిల: ఈ పండగ సీజన్‌లో సహజసిద్ధ వజ్రాల (నేచురల్‌ డైమండ్స్‌)కూ మంచి డిమాండ్‌ లభించింది. గడిచిన 8 ఏళ్లలో రెండో అత్యధిక వజ్రాల విక్రయాలు నమోదయ్యాయి. నేచురల్‌ డైమండ్స్‌ విక్రయాలు ధన్‌తేరస్‌ నాడు 250 శాతం, దీపావళికి 47 శాతం పెరిగాయని సీ కృష్ణయ్య చెట్టి జువెలర్స్‌ తెలిపింది.

రూ.77,400 కోట్లు: ఈ పండగ సీజన్‌లో భారతీయులు కొనుగోలు చేసిన బంగారం, వెండి మొత్తం విలువ

కొనుగోళ్ల వృద్ధి

బంగారం 30శాతం10శాతం

21 శాతం తగ్గుదల

దీపావళినాటికి బంగారం ధర

2025 2026

రూ.1.80 లక్షలు రూ.1.42 లక్షలు

ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 03:09 AM