మార్కెట్లకు వడ్డీ రేట్ల భయాలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:26 AM
భారత స్టాక్ మార్కెట్లో మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 318.56 పాయింట్ల నష్టంతో 81,592.45 వద్దకు జారుకుంది.
సెన్సెక్స్ 318 పాయింట్లు పతనం
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 318.56 పాయింట్ల నష్టంతో 81,592.45 వద్దకు జారుకుంది. నిఫ్టీ 155.05 పాయింట్లు కోల్పోయి 25,144.30 వద్ద ముగిసింది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠ స్థాయి 6 శాతానికి చేరిన నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చన్న భయాలతో పాటు చమురు ధరల పెరుగుదల ఇందుకు కారణమయ్యాయి. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు తగ్గి రూ.94.20 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో అర శాతం మేర పెరిగి 96.26 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
విలువైన లోహాల రేట్లు వరుసగా మూడో రోజు తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మరో రూ.2,500 తగ్గి రూ.1.40,900కు జారుకుంది. కిలో వెండి కూడా రూ.3,500 తగ్గుదలతో రూ.1,84,000కు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక శాతం తగ్గి 3,904 డాలర్లకు, సిల్వర్ 50 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి