రూపాయి రికార్డు పతనం.. నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - May 05 , 2026 | 10:23 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు దాటింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు దాటింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.33గా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,269)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 77,103 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు పడిపోయింది. ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 76,813 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 140 పాయింట్ల నష్టంతో 23,978 వద్ద కదలాడుతోంది. మళ్లీ 24 వేల మార్క్ దిగువకు పడిపోయింది. (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కామ్స్, వొడాఫోన్ ఐడియా, ఏబీ క్యాపిటల్, వేదాంత, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేఈఐ ఇండస్ట్రీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, వోల్టాస్, డెలివరీ, జీఎమ్మార్ ప్రాపర్టీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 71 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 380 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్
ఓడిపోయే మ్యాచ్ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్